Header Banner

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు! ఘన నివాళ్లు అర్పించిన టీడీపీ నేతలు..

  Sat Apr 05, 2025 14:53        Politics

పేదల పేన్నిధి, బడుగు బలహీన వర్గాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేసిన మహనీయుడు, భారత మాజీ ఉప ప్రధాని  బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూల దండలు వేసి నేతలు ఘన నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ..  బడుగుల సాధికారతే లక్ష్యంగా.. దేశాభివృద్ధే ధ్యేయంగా నిరంతరం దేశ యశస్సు కోసం.. దేశ ప్రజల ఉన్నతి కోసం.. సమసమాజ స్థాపన కోసం  బాబు జగ్జీవన్ రామ్ చేసిన కృషి అందరికి ఆదర్శనీయమన్నారు. ఇటువంటి గొప్ప నేతల ఆలోచనలు ఆశయాలను నేటి నాయకులు, యువత ఆదర్శంగా తీసుకొని సమాజ అభివృద్ధికోసం.. సమసమాజ స్థాపన కోసం కృషి చేయాలన్నారు.

 

ఇది కూడా చదవండి: జనాభా పెరుగుదలపై నిశ్శబ్దం వీడాలి.. చర్చ జరగాలి! కృష్ణా జిల్లాలో చంద్రబాబు పర్యటన!

 

నాడు తనతో 198 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారని.. తనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వమని బాబూ జగ్జీనవ్ రామ్ కోరితే.. ఆనాడు అధికారంలో ఉన్న పార్టీతో పాటు నాడు రాజకీయంలో ఉన్న ‘’దుష్టచతుష్టయం’’  కైసా భనేగా ఎక్ చమాన్ ఈ దేశ్ కి ప్రధాని అంటూ దళితులపై వారి అహంకారిన్ని చూపారని.. అందుకే కాంగ్రెస్ లో దళితులకు న్యాయం జరగదని భావించిన జగ్జీవన్ రామ్ జనతాపార్టీలోకి వెళ్లి దేశ ఉప ప్రధాని అయ్యారని వర్లరామయ్య తెలిపారు. నాటి (1997లో) దేశ రాజకీయ సంక్షోభ పరిస్థితుల్లో చంద్రబాబు జాతీయ స్థాయిలో కీలకంగా ఉండి ఉంటే.. మా దళిత మిడ్డ.. చెప్పులు కుట్టుకునే వ్యక్తి.. అంటరాని వ్యక్తి అని దుష్టచతుష్టయం భావించిన  జగ్జీవన్ రామ్ ని  ప్రధానిని చేసి దళితులకు  పెద్ద పీట వేసేవాని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న అంటరాని తనం అస్పృశ్యతను దూరం చేసి.. హోటల్స్ లో ఉన్న రెండు గ్లాసుల సిద్దాంతాన్నితొలగించారన్నారు.. దేవాలయాల్లో దళితులకు ప్రవేశాన్ని కల్పించారన్నారు. జస్టిస్ పున్నయ్య సూచించిన అంశాలను క్యాబినేట్ లో పెట్టి దళితులకు మేలు చేశారని కొనియాడరు. దళిత బిడ్డ బాలయోగి (మాల) లోక్ సభ స్పీకర్ ను చేశారన్నారు. అలాగే మరో దళిత బిడ్డ కే ఆర్ నారాయణన్ రాష్ట్రపతి అవ్వడానికి చంద్రబాబు సహకారం అందించారన్నారు.   శాసన సభ అధ్యక్షురాలిగా శ్రీమతి ప్రతిభా భారతి, మొట్టమొదటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా  కాకి మాధవరావులను నియమించి దళితులను అగ్రస్థానంలో ఉంచిన  గొప్ప వ్యక్తి చంద్రబాబు అన్నారు.  సుప్రీం తీర్పు వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపి రాష్ట్రంలో దళితులకు సమన్యాయం చేసిన  దళిత బాంధవుడు చంద్రబాబు అన్నారు. ఇటువంటి దళిత పక్షిపాతి అయిన చంద్రబాబు వెంట ఎస్సీలందరూ నడిచి టీడీపీకీ వెన్నుదన్నుగా ఉండాలని.. బడుగు బలహీన వర్గాలకోసం బాబూ జగ్జీవన్ రామ్ కలలను నిజం చేస్తున్న టీడీపీతో కలిసి నడవాలని కోరారు.

 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు: శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ మంత్రి పీతల సుజాత, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి భీమినేని వందనాదేవి, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ శిరీష, రాష్ట్ర కార్యదర్శి జగదీశ్ బాబు, ఎస్సీ నేతలు చిలక బసవయ్య, యర్రం రామారావు, ఆలూరి రాజేష్, పేరుపోగు రాజేష్, వల్లూరి కిరణ్, ఆదాం, మైనర్ బాబు, మందా మోహన్, మీడియా కోఆర్డినేటర్ ధారపనేని నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కీలక దశకు పాస్టర్ ప్రవీణ్ మృతి.. మాజీ ఎంపీపై కేసు న‌మోదు! వైసీపీ గుండెల్లో గుబులు..

 

సెల్ఫీ వీడియోతో కలకలం! ఎస్ఐ వేధింపులతో ఆత్మహత్యాయత్నం!

 

ఆ రూట్ ని మోడరన్ రహదారిగా.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్! నాలుగు లైన్ల రహదారి రూపంలో..!

 

ఏపీలో మెడిసిన్ మేకింగ్ హబ్.. భారీ పెట్టుబడులతో మెగా ప్రాజెక్ట్! 7,500 మందికి ఉపాధి కల్పన!

 

అమెరికాను వీడొద్దు వెళ్తే రాలేరు.. హెచ్‌1బీ వీసాదారులకు - టెక్‌ దిగ్గజాల అలర్ట్‌! ఉద్యోగుల గుండెల్లో గుబులు..

 

అమెరికాను వీడొద్దు వెళ్తే రాలేరు.. హెచ్‌1బీ వీసాదారులకు - టెక్‌ దిగ్గజాల అలర్ట్‌! ఉద్యోగుల గుండెల్లో గుబులు..

 

ఏపీకి మరో భారీ పెట్టుబడి వచ్చింది.. రూ.5వేల కోట్లతో - ఆ జిల్లాకు మహర్దశ! ప్రత్యక్షంగా, పరోక్షంగా 7,500 మందికి..

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

వైసీపీ ఎంపీ అరెస్ట్.. ప్యాలెస్ షేక్! లిక్కర్ స్కాంలో హైకోర్టు కీలక నిర్ణయం..!

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations